- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైరెక్టర్‌గా మారిపోయిన హీరో కిరణ్ అబ్బవరం
డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. తన కెరీర్‌లో మరో మైలు రాయి చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

దిశ, సినిమా: డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. తన కెరీర్‌లో మరో మైలు రాయి చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే నిర్మాతగా మారి సినిమాలు రూపొందిస్తున్న ఈ హీరో.. ఇప్పుడు తన కెరీర్‌లోనే అతిపెద్ద సవాల్‌కు సిద్ధమవుతున్నారు. ఒక నటుడిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకున్న కిరణ్ అబ్బవరం.. తాజాగా దర్శకుడిగానూ బాధ్యతలు చేపట్టి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.
ఈ మేరకు తనే స్వయంగా కథ రాసుకుని, నటిస్తూ, దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'రియాలిటీ' అనే ఆసక్తికరమైన టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత చాగంటి సుధాకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుండగా.. మాస్ అండ్ క్లాస్ మెలోడీల కింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చనున్నారు. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో శుక్రవారం ఉదయం గ్రాండ్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తుంది.






