గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలి:డీఎస్పీ అశోక్

by Jakkula.Mamatha |

మత్తు పదార్థాల వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని మాదకద్రవ్యాల వంటి వాటికి దూరంగా ఉండాలని డీఎస్పీ అశోక్ అన్నారు.

గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలి:డీఎస్పీ అశోక్
X

దిశ, వాంకిడి: మత్తు పదార్థాల వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని మాదకద్రవ్యాల వంటి వాటికి దూరంగా ఉండాలని డీఎస్పీ అశోక్ అన్నారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం వాంకిడి మండలంలోని బానర్ కోసరా, చిన్న వాంకిడి గ్రామాల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీఐ, ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది డాగ్ స్క్వాడ్ సహాయంతో గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి అమ్మినా, తాగినా, గంజాయి చెట్లు పెంచిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇళ్లలో గంజాయి నిల్వ ఉంచిన, అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామస్తులకు గంజాయి దుష్ప్రభావాల పై అవగాహన కల్పించారు.

Next Story