- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బుల వివాదం.. జిమ్ ట్రైనర్‌పై కేసు నమోదు
డబ్బుల వివాదం నేపథ్యంలో ఓ జిమ్ ట్రైనర్‌పై కేసు నమోదైన ఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, మేడిపల్లి 11/04: డబ్బుల వివాదం నేపథ్యంలో ఓ జిమ్ ట్రైనర్‌పై కేసు నమోదైన ఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చెంగిచెర్లలోని శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీకి చెందిన బజూరి ప్రీతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదురాలి కుమారుడు స్థానిక స్టార్ ఫిట్ నెస్ జిమ్‌లో వ్యాయామం చేసేవాడు. అక్కడ ట్రైనర్‌గా పనిచేస్తున్న కిరణ్ రెండు నెలల క్రితం తన కుమారుడికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 9న ఆమె కుమారుడు దుకాణానికి వెళ్తుండగా కిరణ్ తన స్నేహితులతో కలిసి అడ్డగించి అప్పు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే తాను ఎలాంటి డబ్బులు బాకీ లేనని చెప్పడంతో కిరణ్ దుర్భాషలాడి బెదిరించినట్లు ఆరోపించారు. అనంతరం జూన్ 10న ఉదయం కిరణ్ సుమారు 20 మంది వ్యక్తులతో కలిసి ఇంటి ముందు టెంట్ ఏర్పాటు చేసి, డప్పులు మోగిస్తూ హంగామా సృష్టించాడని ఫిర్యాదులో తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రావడం, లోపలికి వెళ్లడం కూడా ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.






