- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: స్పీడ్ తగ్గినా..వృద్ధి రేటులో భారత్‌దే పైచేయి
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని సంస్థ అంచనా వేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఆర్థికవ్యవస్థ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ వృద్ధి మాత్రం ఇంకా బలంగానే కొనసాగుతోందని వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 7.7 శాతం నుంచి 6.6 శాతానికి కొంత మందగించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని సంస్థ అంచనా వేసింది. పెరిగిన చమురు ధరలు, ఇంధన వ్యయాలు, ఇతర ఉత్పత్తి ఖర్చులు వినియోగం, పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నప్పటికీ, దేశీయ డిమాండ్ ఆర్థికవ్యవస్థకు బలమైన మద్దతుగా నిలుస్తోందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలంగా ఉండగా, పట్టణ మార్కెట్లలో కూడా పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. అయితే ఈ మందగమనం దీర్ఘకాలికం కాదని, 2027-28 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు మళ్లీ 7.2 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. దేశీయ డిమాండ్ మరింత బలపడటం, ఎగుమతులు పుంజుకోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాలు దీనికి ప్రధాన కారణాలుగా నిలవనున్నాయి. దక్షిణాసియా మొత్తం వృద్ధికి కూడా భారత్ ప్రధాన చోదక శక్తిగా కొనసాగనుందని పేర్కొంది.






