ఇరాన్ పై దాడులు నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన

by velandi.Saikiran |

ఇరాన్ పై ఇవాళ రాత్రి చేయాల్సిన దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్.

ఇరాన్ పై దాడులు నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మళ్లీ యుద్ధం మొదలైన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పై ఇవాళ రాత్రి చేయాల్సిన దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ అత్యున్నత స్థాయి నాయకత్వంతో చర్చలు ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు ట్రంప్. రెండు దేశాల మధ్య ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాలపై తుది చర్చలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఆయా అంశాలను పాకిస్తాన్, UAE సహా మిత్ర పక్షాలు అంగీకరించాయని పేర్కొన్నారు. ఇరాన్ తో డీల్ ఖరారు అయ్యే వరకు నావల్ బ్లాకేడ్ కొనసాగుతుందని కుండబద్దలు కొట్టి చెప్పారు అమెరికా అధ్యక్షులు ట్రంప్.

Next Story