ఉప్పల్ లో అగ్నిప్రమాదం..నాలుగో అంతస్తులో మంట‌లు

by velandi.Saikiran |

ఉప్పల్ లో అగ్నిప్రమాదం జ‌రుగ‌గా, నాలుగో అంతస్తులో మంట‌లు చెల‌రేగాయి.

ఉప్పల్ లో అగ్నిప్రమాదం..నాలుగో అంతస్తులో మంట‌లు
X

దిశ, ఉప్పల్ : ఉప్పల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పల్ భగాయత్‌ లోని రాయల్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కార‌ణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయంలో ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జ‌రుగ‌లేదు. కానీ ఇంట్లో వ‌స్తువులు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకు వ‌చ్చింది. దీంతో ఇతర ఫ్లాట్లకు ప్రమాదం తప్పింది. ఈ సంఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని, పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story