- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ అర్ధరాత్రికి భారీ వర్షాలు...ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ అర్ధరాత్రి నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ అర్ధరాత్రి నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇందులో భాగంగానే నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, అదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి జిల్లాలలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు హైదరాబాద్ మహానగరంలో కూడా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ లో భారీగానే వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఇలాంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్లు, కరెంటు పోల్స్ దగ్గర అస్సలు ఉండకూడదని సూచనలు చేశారు.






