వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది !

by velandi.Saikiran |

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ లో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం.

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది !
X

దిశ‌, వెబ్ డెస్క్: 2027 వన్డే వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ టోర్నమెంట్ గురించి బిగ్ అప్డేట్ వైరల్ గా మారింది. అక్టోబర్ 4వ తేదీన 2027 లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. దక్షిణాఫ్రికాలో జరిగే ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది అక్టోబర్ 4వ తేదీన ప్రారంభమై... నవంబర్ 21వ తేదీతో ముగియనుందట.

ఈ టోర్నమెంట్ లో భాగంగా మొత్తం 41 మ్యాచ్ లకు దక్షిణాఫ్రికా ప్రాతినిధ్యం వహిస్తుంది. జింబాబ్వే లో 8 నుంచి పది మ్యాచ్ లు జరిగే అవకాశాలు ఉన్నాయి. నమీబియా వేదికగా మూడు మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షెడ్యూల్ వైరల్ గా మారింది. కాగా వన్డే వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్ పూర్తికాగానే రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు.

Next Story