- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PUC: కొత్త బీఎస్6 కార్లకు పొల్యుషన్ సర్టిఫికేట్ మూడేళ్ల చెల్లుబాటు?
భారత్ స్టేజ్ (బీఎస్) ఉద్గార ప్రమాణాలు వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు అమలు చేస్తున్న నిబంధనలు.

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త బీఎస్6 వాహనాల యజమానులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం (పీయూసీ) గడువును, ఆరు సంవత్సరాలలోపు బీఎస్6 ప్రైవేట్ వాహనాలకు మూడేళ్లకు పెంచాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిపాదన ప్రకారం 6 నుంచి 10 ఏళ్ల మధ్య ఉన్న బీఎస్6 వాహనాలు ఏడాదికోసారి, 10 ఏళ్లు దాటిన బీఎస్6 వాహనాలు ఆరునెలలకోసారి పీయూసీ సర్టిఫికెట్‌ను రెన్యూవల్ చేసుకోవాలి. ఇక బీఎస్4 వాహనాలకు ప్రస్తుతం ఉన్నట్లుగానే ఆరునెలలకోసారి, బీఎస్1, బీఎస్2, బీఎస్3 వాహనాలకు మూడు నెలలకోసారి పీయూసీ తప్పనిసరిగా కొనసాగుతుంది. భారత్ స్టేజ్ (బీఎస్) ఉద్గార ప్రమాణాలు వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు అమలు చేస్తున్న నిబంధనలు. భారత్ బీఎస్5 దశను దాటేసి 2020 ఏప్రిల్‌లో నేరుగా బీఎస్6 ప్రమాణాలను అమల్లోకి తీసుకువచ్చింది. తాజా ప్రతిపాదనతో కొత్త తరం, తక్కువ కాలుష్యం విడుదల చేసే వాహనాల యజమానులపై అనవసరమైన రెన్యూవల్ భారం తగ్గడంతో పాటు, పాత వాహనాలపై కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.






