- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వార్డెన్ భోజనం పెట్టడం లేదని వసతిగృహం విద్యార్థుల ఆందోళన
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీసీ వసతిగృహం విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఆందోళన చేపట్టారు.

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీసీ వసతిగృహం విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థులంతా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టగా, సబ్ కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో హాజరైనట్లు తెలియడంతో విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మెనూ ప్రకారం వార్డెన్ భోజనం పెట్టడం లేదని వారు ఆరోపించారు. క్రీడలు ఆడుకునేందుకు అనుమతించడం లేదని వాపోయారు. జైలులో ఉంచినట్లుగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. విద్యార్థులకు పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సబ్ కలెక్టర్ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.






