- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెన్ జీ నిరసనలపై ఎంపీ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘వాంతులు వస్తున్నాయంటూ’ సంచలన పోస్ట్
జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో జెన్ జీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్-యుజి (NEET-UG) పేపర్ లీకేజీ, పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరుతో జెన్ జీ (Gen Z) విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు, రీల్స్ చూస్తుంటే తనకు ‘వాంతులు వస్తున్నాయని’ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. అక్కడ ‘అసహ్యం, చెత్త’ తప్ప ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
పెంపకంపై ప్రశ్నలు..
నిరసనకారులు ఉపయోగిస్తున్న భాష అత్యంత నీచంగా ఉందని విమర్శిస్తూ.. ‘ఈ పిల్లలను ఎవరు కంటున్నారో, ఎలా పెంచుతున్నారో?’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని నిరసనల ద్వారా బెదిరించి (Arm-twist) నిర్ణయాలు తీసుకోలేరని, పార్లమెంట్ ముట్టడికి యత్నించిన గుంపు నుంచి తమను కాపాడిన ఢిల్లీ పోలీసులకు ఆమె అభినందనలు తెలిపారు.
స్పందించిన యువత..
పరీక్షల లీకేజీలు, విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడం, వరుస ఆత్మహత్యల వంటి తీవ్ర సమస్యలపై మాట్లాడకుండా.. కేవలం నిరసనకారులను, వారి రీల్స్‌ను విమర్శించడంపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జంతర్ మంతర్ వద్ద వారాల తరబడి కొనసాగిన విద్యార్థుల ఆందోళనలు, పార్లమెంట్ మార్చ్‌పై పోలీసుల లాఠీఛార్జ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. విద్యార్థుల నిరసనల ఫలితంగా, బాధ్యత వహిస్తూ జూలై 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.






