ఆయనకు మనందరి ప్రార్థనలు అవసరం.. తమన్ పోస్ట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో పెరిగిన ఆందోళన

by Chukka Sudharani |

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది.

ఆయనకు మనందరి ప్రార్థనలు అవసరం.. తమన్ పోస్ట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో పెరిగిన ఆందోళన
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. సోమవారం సాయంత్రం భుజానికి స్వల్ప గాయమైనట్లు ఆయన కార్యలయం తెలిపింది. ఈ మేరకు వైద్యుల బృందం సోమవారం ఒక అధికారిక హెల్త్ బులిటిన్‌ను విడుదల చేసింది. కాగా.. డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఎన్టీఆర్‌కు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. అలాగే.. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి తప్పనిసరని వైద్యులు వెల్లడించారు.

మరోవైపు గాయం విషయం తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తూ.. తన అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. తారక్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘తారక్ అన్న ఎల్లప్పుడూ అందరి ప్రేమకు అర్హులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.. ఆయనకు మనందరి ప్రార్థనలు అవసరం.. అందరం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం’ అంటూ ఎమోషనల్ ఇమేజీలు పంచుకున్నాడు. అయితే ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. ఎన్టీఆర్‌కు ఊహించిన దానికంటే పెద్ద గాయమే అయినట్లు ఉంది అంటూ కామెంట్స్ రూపంలో ఆందోళన చెందుతున్నారు.

Next Story