దసరా మ్యాజిక్ రిపీట్.. క్రేజీ బ్యూటీతో స్టెప్పులేయనున్న నాని

by Chukka Sudharani |

నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’.

దసరా మ్యాజిక్ రిపీట్.. క్రేజీ బ్యూటీతో స్టెప్పులేయనున్న నాని
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న రెండొవ ప్రాజెక్టు కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరవేంగా శరవేగంగా జరుగుతుంది. అయితే.. ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ చేయాలని మొదట మేకర్స్ ప్లాన్ చెయ్యగా.. షూటింగ్ లేట్ అయిన కారణంగా సెప్టెంబర్ మంత్‌కు పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ డేట్‌పై త్వరలో మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ది ప్యారడైజ్ చిత్రంలోని ప్రత్యేక గీతం కోసం ఒక నటి ఖరారయ్యారని తెలుస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం నుండి అందిన సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్‌ను స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేశారట. ఆమె నానితో కలిసి ఈ పాటలో స్టెప్పులు వేసే అవకాశం ఎక్కువగా ఉందని.. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్. ఇదే కన్ఫర్మ్ అయితే.. నానితో కీర్తికి ఇది మూడవ చిత్రం కాగా, దర్శకుడు శ్రీకాంత్ ఒదులతో రెండవ చిత్రం కానుంది. కాగా.. ఈ మూవీలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు.

Next Story