ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ రాజర్షి షా

by Batti.Sumithra |

ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.

ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భూసేకరణ, రహదారి మళ్లింపు, విద్యుత్ టవర్లు, తాగునీటి వ్యవస్థలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందన్నారు.

2,009.23 ఎకరాల్లో భారత వైమానిక దళ శిక్షణ కేంద్రంతో పాటు పౌర విమానయాన సేవలు, ఎంఆర్‌వో (MRO), కార్గో సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భూసేకరణను పారదర్శకంగా పూర్తి చేసి, అర్హులైన భూ యజమానులకు నిబంధనల మేరకు పరిహారం చెల్లించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకట వేణు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు, ఇరిగేషన్ ఎస్‌ఈ ప్రభు కళ్యాణ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సబ్ రిజిస్ట్రార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Next Story