Peddi: 'చికిరి చికిరి' పాట‌కు పెళ్లి కొడుకు మాస్ స్టెప్పులు

by velandi.Saikiran |

పెద్ది సినిమాలో చికిరి చికిరి (Chikiri Chikiri) అంటూ సాగే పాట సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Peddi: చికిరి చికిరి  పాట‌కు పెళ్లి కొడుకు మాస్ స్టెప్పులు
X

దిశ‌, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా పెద్ది. జూన్ 4వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా... ప్రస్తుతం థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళ్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. జనాలకు కథ నచ్చిన నేపథ్యంలో సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. అటు ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు, ఈ పెద్ది ప్రాజెక్టు డీల్ చేసిన నేపథ్యంలో జనాలకు మరింత ఆసక్తి పెరిగింది.

ఇలా పెద్ది సినిమా విజయవంతమైంది. ఈ పెద్ది సినిమాలో చికిరి చికిరి (Chikiri Chikiri) అంటూ సాగే పాట సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట పెళ్లిళ్లకు కూడా పాకేసింది. ఓ రిసెప్షన్ లో పెళ్ళికొడుకు చికిరి చికిరి పాటకు స్టెప్పులు వేశాడు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని.. అచ్చం రామ్ చరణ్ ను దింపేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. క్లిక్

Next Story