- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య సినిమాలో విలన్ గా టాలీవుడ్ హీరో..కొరటాల శివ ప్లాన్ అదుర్స్ !
కొరటాల శివ-బాలయ్య సినిమా గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇటీవల అఖండ 2 సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్న నందమూరి బాలయ్య... ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో మరో మూవీ స్టార్ట్ కానుంది. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్స్ తాజాగా వైరల్ గా మారాయి. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ హీరో రాజశేఖర్ తో పాటు RX 100 సినిమాతో పాపులర్ అయిన కార్తికేయ కూడా మెరువనున్నారట. ఈ క్రమంలో కార్తికేయను మెయిన్ విలన్ గా పెట్టే దిశగా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే రాజశేఖర్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ మేరకు న్యూస్ వైరల్ గా మారింది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






