- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోపంతో ఊగిపోయిన బాలయ్య...వీడియో వైరల్
బాలయ్య పుట్టినరోజు జరగగా... హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో ఫోటో సెషన్ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూనే.. అటు రాజకీయాల్లో దూకుడుగా ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య.. హిందూపురంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అయితే అలాంటి నందమూరి బాలయ్య... అభిమానుల పట్ల అప్పుడప్పుడు కాస్త సీరియస్ అవుతూ ఉంటారు. క్షణాల్లోనే ఆయనకు కోపం వస్తుంది. అలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి.
లేటెస్ట్ గా ఆయన పుట్టినరోజు జరగగా... హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో ఫోటో సెషన్ జరిగింది. ఈ సందర్భంగా నందమూరి బాలయ్య తో ఫోటోలు దిగేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. కొంతమంది ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలయ్య అసహనానికి లోనయ్యారు. వెనక్కి వెళ్ళండి అంటూ వారిపై సీరియస్ అయ్యారు. ఇక బాలయ్య కోపాన్ని చూసి, అభిమానులు సైతం క్రమశిక్షణతో ఒకే వైపునకు వచ్చి లైన్ లో నిలబడిపోయారు. ఆ తర్వాత శాంతించిన నందమూరి బాలయ్య... యథావిధిగా అభిమానులతో ఫోటోలు దిగారు. ఈ వీడియో వైరల్ గా మారింది.






