- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినియోగదారులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు..తూకంలో భారీ మోసం
వినియోగదారులకు తూకాలలో మోసాలు జరక్కుండా క ట్టడి చేయాల్సిన తూనికలు, కొలతల (లీగల్ మెట్రాలజీ) శాఖ అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి.

దిశ, శేరిలింగంపల్లి : వినియోగదారులకు తూకాలలో మోసాలు జరక్కుండా క ట్టడి చేయాల్సిన తూనికలు, కొలతల (లీగల్ మెట్రాలజీ) శాఖ అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. తనిఖీల సంగతే మర్చిపోయారు. దీంతో వ్యాపారులు వినియోగదారులను నిలువునా ముం చుతున్నారు. ధరల నియంత్రణ పట్టించుకోని ప్రభుత్వం తూకంలో మోసా లు అరికట్టడంలోనూ ఘోరంగా విఫలమవుతున్నారు. తారా నగర్, మదీనాగూడ తదితర ప్రాంతాలలో అనేక నగల దుకాణాలు వెలిశాయి. తూకం లో సరైన ప్రమాణాలు పాటించడం లేదు. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో తూకంలో భారీగా మోసాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. నాణ్యమైన వస్తువులను, సరైన కొలతలతో పొందడం వినియోగదారుడి ప్రాధమిక హక్కు. కానీ ఆ హక్కు పొందడంలో అడుగడుగునా మోసపోవాల్సి వస్తుంది.
ధరలపై నియంత్రణ ఏది?
వస్తువులపై ముద్రించిన ధరలపై ని యంత్రణ లేదు. కిలో అని కళ్ల ముందే తూచి ఇచ్చిన సరుకు వాస్తవానికి ఏడు, ఎనిమిది వందల గ్రాములే ఉం టోంది. పెట్రోలు బంకుల్లో ఆపరేటర్ల హస్తలాఘవం, కూరగాయలు, చేపలు, మటన్, చికెన్, కిరాణా మార్కెట్లో వినియోగదారున్ని బకరా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వ్యాపారులు చేసే మోసాలు అరికట్టాల్సిన అధికారులు కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనిఖీల సంగతే మరిచారా?
లీగల్ మెట్రాలజీ పరిధిలో బాట్లు (తూకం రాళ్లు), ఎలక్ట్రానిక్ తూకం యంత్రాల నిర్వహణపై నియంత్రణ లేదు. తూకం యంత్రాలకు సీల్ వేస్తా రు. బాట్లుకు స్టాంపింగ్ చేస్తూ వ్యా పారుల నుంచి ఫీజు వసూలు చేస్తు న్నారు. స్టాంపింగ్ సమయంలో తూ నికలు, కొలతల శాఖ ఉద్యోగుల నిఘా ఉండాలి. బాట్లు, కొలతలకు ముద్రలు వేసేటప్పుడు అవి సక్రమంగా ఉన్నా యో లేదో పరిశీలించాలి. వ్యాపారుల వద్ద తుకాలు సక్రమంగా ఉన్నాయో లేవో చూసే నాథుడే లేడు. బాట్లకు బదులు కొందరు రాళ్లను వినియోగిం చి వినియోగదారులను మోసం చేస్తు న్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి లైసెన్స్ జారీ చేసి తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు మౌనంగా ఉండ డంతో వ్యాపారులు అడ్డదారులు వెతుకొంటున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలకు మరమ్మతు లైసెన్స్ పొందాలంటే స్కిల్డ్ వర్కర్ తప్పనిసరి. కానీ అధికారులు ఎటువంటి పరిజ్ఞానం లేని వారికి కూడా లైసెన్స్ ఇస్తూ, కనీస అర్హత పరీక్ష కూడా నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గచ్చిబౌలి,మియాపూర్ ప్రాంతాలలో తూనికల, కొలతలశాఖ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో వినియోగదారులు నష్టపోతున్నారు. చిరు వ్యాపా రుల నుంచి మొదలు పెద్ద వ్యాపారుల వరకు అన్ని చోట్లా కాంటాల ట్యాంప రింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో తూకంలో తేడాతో వినియోగదారులు నష్టపోతున్నారు.
పట్టించుకోని అధికారులు..
కొలత విషయంలో ఏ విధమైన మోసా నికి గురి కాకుండా నాణ్యమైన వస్తువులను పొందడం వినియోగదారుల హక్కు. కానీ ఆ హక్కు సాధించుకోగలగడం అంత సులభమేమీ కాదు. పెట్రోలు బంకుల్లో ఆపరేటర్ల హస్తలాఘవం వల్ల వాహనదారులు నష్టపోక తప్పడం లేదు. రైతులు రెక్కలు ము క్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని అమ్మేటప్పుడు 70కిలోల బస్తాకు దాదాపు ఆరేడు కిలోలు తూకంలో మోసాల కారణంగా నష్టపోతున్నారు. ఇలా వ్యాపారులు అన్ని రంగాలను నుంచి దోసుకుంటున్నారు.తూనిక లు - కొలతల్లో మోసాలతో వినియోగదారులు తాము చెల్లించే డబ్బుకు తగిన విలువైన వస్తువును పొందలేక నష్టపోతున్నారు. తూనికలు-కొలతల విష యంలో మోసపోయినట్లు భావించినప్పుడు స్థానిక లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. లేదా కంట్రోలర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాం..
ఎంత తనిఖీలు చేస్తున్న వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. తూకం యంత్రాలకు సీల్ వేస్తున్నాం.ఎవరై టాంపరింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తున్నాం.తరచుగా దాడులు నిర్వహించి వ్యాపారస్తులకు భారీ జరిమానాలు వేస్తున్నాం. లింగంపల్లి మార్కెట్ యార్డ్‌లో తూకంలో మోసాలు చేయకుండా అవగాహన కలిగించాం.నగలు దుకాణాలు జిల్లా ఇన్ స్పెక్టర్ తనికి చేపట్టాలి.
- అశోక్ రావు, లీగల్ మెట్రాలజీ అధికారి






