- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరలక్ష్మికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన డైరెక్టర్
నటి వరలక్ష్మికి డైరెక్టర్ మేగోటి సంజీవ్ క్షమాపణలు చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటి వరలక్ష్మీపై నిన్న సంచలన ఆరోపణలు చేశారు పోలీస్ కంప్లైంట్ దర్శకుడు మేగోటి సంజీవ్. ప్రమోషన్స్ కోసం రమ్మంటే, రాలేదని ఆమెపై ఫైర్ అయ్యారు. అయితే ఈ వివాదం రాజుకున్న నేపథ్యంలో దర్శకుడు మేగోటి సంజీవ్ కాస్త వెనక్కి తగ్గారు. వరలక్ష్మి పై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమెకు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.
సినిమా విడుదల ఆలస్యమైనందున బాధతో తాను పొరపాటుగా మాట్లాడినట్లు వివరించే ప్రయత్నం చేశారు. చేతికి గాయం అయినప్పటికీ ఆమె సినిమా కోసం కష్టపడ్డారని ప్రశంసించారు. వరలక్ష్మి కోసమే ఈ సినిమా రెడీ చేసుకున్నట్లు గుర్తు చేశారు మేగోటి సంజీవ్. షూటింగ్ సమయంలో ఆమె కుటుంబ సభ్యురాలిగా తనకు సపోర్ట్ చేసినట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంజీవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా పోలీస్ కంప్లైంట్ సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కానుంది. క్లిక్






