ముదిరాజ్ లను బీసీ - డీ నుంచి బీసీ - ఏ లోకి మార్చండి : మంత్రి వాకిటి శ్రీహరి

by Muthe.Rajitha |

ముదిరాజ్ కులస్థులను బీసీ - డీ నుంచి బీసీ - ఏ లోకి మార్చాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ని కలిశారు.

ముదిరాజ్ లను బీసీ - డీ నుంచి బీసీ - ఏ లోకి మార్చండి : మంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముదిరాజ్ కులస్థులను బీసీ - డీ నుంచి బీసీ - ఏ లోకి మార్చాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ని కలిశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే కులగణన ప్రకారం ముదిరాజ్ కులం రాష్ట్రంలోనే మూడవ అతిపెద్ద సామాజిక వర్గంగా, బీసీలలో రెండవ అతిపెద్ద కులంగా అవతరించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ముదిరాజ్ జనాభా 26 లక్షల 39 వేల 027 తో 7.4 శాతంగా నమోదు కాగా, బీసీలలో అత్యధిక జనాభా కలిగిన కులాలలో ఒకటిగా నిలిచిందని ఆయన వెల్లడించారు. ముదిరాజ్ జాతి ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనకబడి ఉందని, ముదిరాజ్ సామాజిక వర్గం విద్య, ఉపాధి మరియు రాజకీయ ప్రాతినిధ్యంలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు.

బీసీ- డీ నుండి ఏ లోకి మారిస్తే భావి తరాలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. తాను ఒక మంత్రిగా కాకుండా ముదిరాజ్ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నట్లుగా బీసీ కమిషన్ చైర్మన్ కు శ్రీహరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, ముదిరాజ్ నేతలు కాసాని వీరేష్, బలరామ్ తదితరులు ఉన్నారు.

Next Story