- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బిజెపి కుట్ర : టీపీసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ పొన్నం అశోక్ గౌడ్
బీజేపీ కుట్ర పూరితంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించేలా చేసిందని టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్, పొన్నం అశోక్ గౌడ్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ కుట్ర పూరితంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించేలా చేసిందని, ఎఫ్ఐఆర్ నమోదు కాని కేసు పేరు చెప్పి నామినేషన్ తిరస్కరించడం అన్యాయమని టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్, పొన్నం అశోక్ గౌడ్ విమర్శించారు. గురువారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసు వివరాలు అభ్యర్థి కి తెలియనప్పుడు నామినేషన్ లో ఎలా చూపిస్తారని, సాంకేతిక అంశాలు చూపిస్తూ నామినేషన్ రిజెక్ట్ చేయడం పెద్ద కుట్ర అని ఆయన ఆరోపించారు. అభ్యర్థిని క్లారిఫై అడగకుండా నామినేషన్ తిరస్కరించడాన్ని నేరంగా పరిగణించాలని, జార్ఖండ్ లో బీజేపీ అభ్యర్థి కోసం ఒక రోజు సమయం ఇచ్చి క్లారిఫైకి అవకాశం ఇచ్చారు, మరి కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఎందుకు ఇవ్వరని పొన్నం అశోక్ గౌడ్ ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తీర్పు మీనాక్షి నటరాజన్ కి అనుకూలంగా రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసే అధికారం ఆర్వోకు లేదని, 324 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల సంఘానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, మోడీ ప్రభుత్వంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు జగదీశ్వర్ రావు ఆరోపించారు. బలం లేకున్నా బీజేపీ మూడో అభ్యర్థి ని బరిలో పెట్టి కుట్రకి తెరలేపిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలని జగదీశ్వర్ రావు డిమాండ్ చేశారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అమానుషం.. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థగా వ్యవహారించాలి : టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్, పులిపాటి రాజేష్ కుమార్
ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరించడం అమానుషమని, ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థగా కాకుండా బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్, పులిపాటి రాజేష్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మార్చి 5న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి బీహార్ లో రాజ్యసభ ఎన్నికల సమయంలో నామినేషన్ వేసేటప్పుడు నితీష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎలక్షన్ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని టీపీసీసీ తరఫున కంప్లైంట్ చేశామని, మూడు నెలల తర్వాత జూన్10 2026 సమాధానం వచ్చిందన్నారు. చాలా రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగుతున్నందున పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయని, మీరు చేసిన కంప్లైంట్ కి సంబంధించిన ఎలక్షన్స్ ప్రక్రియ ముగిసిపోయింది, మేము అందులో ఏమి యాక్షన్ తీసుకోలేక పోతున్నామని సమాధానం చెస్పారని ఆయన తెలిపారు.
ఈ సమాధానం ఈసీ ద్వంద వైఖరి ప్రదర్శిస్తుందని, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి పై వచ్చిన ఫిర్యాదుకి సమాధానం ఇచ్చే సమయం ఇవ్వకుండా నామినేషన్ ని తిరస్కరిస్తారని, మరో వైపు బీజేపీ నాయకుల రాజ్యసభ నామినేషన్ కి సంబంధించి కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే మూడు నెలల తర్వాత సమయం అయిపోయినందున ఏమి చేయలేమని సమాధానం ఇస్తారని రాజేష్ కుమార్ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ ద్వంద వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని, ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థగా వ్యవహారించాలని ఆయన డిమాండ్ చేశారు.






