- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో టెస్లా కారు తొలి షోరూం
by Muthe.Rajitha |
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టెస్లా భారత్‌లో విస్తరణకు శ్రీకారం చుడుతున్నది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టెస్లా భారత్‌లో విస్తరణకు శ్రీకారం చుడుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో టెస్లా తొలి షోరూం ఈ నెల 17న ప్రారంభం కానుంది. నగరంలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ షోరూం ద్వారా టెస్లా తన అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. టెస్లా కార్లపై ఆసక్తి ఉన్న వినియోగదారులు ప్రత్యక్షంగా వాహనాలను పరిశీలించే అవకాశం పొందనున్నారు. భారత మార్కెట్‌లో టెస్లా ప్రవేశంపై చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆటోమొబైల్ ప్రేమికులకు ఈ పరిణామం శుభవార్తగా మారింది. టెస్లా షోరూం ప్రారంభంతో హైదరాబాద్ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. ఓక్టేబ్ బ్లాక్, నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీలో ఈ షోరూం ప్రారంభం కానుంది.
Next Story






