కాంగ్రెస్ లో కోవర్టులు ఉంటే తొడ్కల్ తీస్తాం : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

by Muthe.Rajitha |

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ లో కోవర్ట్ లున్నారనే ఆరోపణలపైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ లో కోవర్టులు ఉంటే తొడ్కల్ తీస్తాం :  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ లో కోవర్ట్ లున్నారనే ఆరోపణలపైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కోవర్టులు ఉంటే తొడ్కల్ తీస్తామన్నారు. బీజేపీ ట్రాప్ లో ఎవరూ పడకండి అంటూ ఆయన హెచ్చరించారు. గురువారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ తన దొంగతనం బయట పడకుండా బీజేపీ కోవర్ట్ లు అంటూ డ్రామాలు ఆడుతోందని, మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు తెలంగాణ కాంగ్రెస్ పై బురదజల్లుతూ దొంగతనం చేసిన వారు తప్పించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తమపై అభాండాలు వేస్తున్నారని, వారు చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ గలీజ్ రాజకీయాలు చేస్తోందని, ఒక రాజ్యసభ సీటు కోసం ఇంత దిగజారడం అవసరమా? ఆ పార్టీకి విలువలు లేవు, నైతికి విలువలు లేవు అని ఆయన మండిపడ్డారు. 12 ఏండ్లుగా ప్రభుత్వంలో ఉంటూ బీజేపీ గలీజ్ రాజకీయాలు చేస్తోందని, మీనాక్షి నటరాజన్ ను ఉద్దేశపూర్వకంగా బీజేపీ అట్టుకుందని ఆయన ఆరోపించారు.

సాదా సీదా మహిళ నేత మీనాక్షి నటరాజన్ అని, అలాంటి మహిళలను బీజేపీ అడ్డుకోవడం దౌర్భాగ్యమని జగ్గారెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ని వాడుకొని కాంగ్రెస్ రాజ్యసభ సీటును బీజేపీ అడ్డుకున్నదని, ప్రధాని మోదికి ఆమె రాజ్యసభ సీటును రాకుండా అడ్డుకోవడం ఏం అవసరమని ఆయన ప్రశ్నించారు. ప్రైవేట్ ఫిర్యాదులో ఏం ఉన్నదో లేదో తెలీదని, చిన్న కేస్ సాకుతో రిజక్టు చేస్తారా? రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు బీజేపీ ఓటు చోరీ చేసే గెలుస్తున్నారని, అధికారంతో ఈసీని అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను కబ్జా చేస్తోందని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఒక్క రాజ్యసభ సీటు కోసం ఇంత దిగజారుడు అవసరమా? సిగ్గుపడ్పాల్సిన అంశమనేది బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని నిరూపించుకోండి, అంతే కానీ, షార్ట్ కట్ లో రాజ్యసభ సభ్యత్వం లాక్కోవడం మీకు గొప్పతనం కాదన్నారు.

దొంగతనం చేసింది బీజేపీ వాళ్ళు అయితే బురద జల్లేది బీఆర్ఎస్ అని, ఆ బురద తెలంగాణ కాంగ్రెస్ నేతల మీద బురద జల్లుతుందని జగ్గారెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. హరీష్ మా మీద బురద జల్లడం కాదని, నీతిమాలిన చర్య చేసిన బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని జగ్గారెడ్డి నిలదీశారు. ప్రాంతీయ పార్టీల్లో ఒక్కడే హీరో అని, బీజేపీలో ఎవరు మాట్లాడినా అప్పుడే రాజకీయం జీవితం ఖతం అవుతుందని, కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ, అందుకే కాంగ్రెస్ అంటారని ఆయన చెప్పారు. హరీష్ మాటలకు తాడు బొంగరం లేదని, ప్రభుత్వం ఉన్నప్పుడు మామ పంచన ఉన్నాడని, ఇప్పుడు రోడ్ల మీద పడ్డాడని జగ్గారెడ్డి విమర్శించారు.

Next Story