- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదృశ్యమైన వ్యక్తి.. మృతదేహం గుర్తింపు
ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో గుండెపోటు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

దిశ, గోపాల్ పేట : ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో గుండెపోటు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన దొబ్బల శాంతయ్య (58) తెలంగాణ, ఆంధ్ర తదితర ప్రాంతాలకు వలస కూలిగా వెళ్లి గత మే నెల 19న గ్రామానికి చేరుకున్నాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊళ్లో ఉన్న వాళ్ళతో పాటు.. బంధువుల ఇళ్లలోను గాలించారు . కానీ సమాచారం లభించలేదు. ఈనెల 4న శాంతయ్య కుమారుడు గోపాల్ రేట్ ఆఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో ఫోన్ లో పలుమార్లు మాట్లాడినట్లుగా గుర్తించారు.
ఆమెను స్టేషన్ కు పిలిపించి విచారించడంతో బుద్ధారం గ్రామం సమీపంలోని అడవి ప్రాంతంలో అతను, నేను ఏకంతంగా ఉన్న సమయంలో గుండెపోటు వచ్చి అక్కడికి అక్కడే మరణించినట్లు ఆ మహిళ తెలిపినట్లు సమాచారం. ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని అక్కడే వదిలేసి వచ్చినట్లు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు ఆ మహిళను తీసుకొని సంఘటన స్థలానికి పరిశీలించగా శాంతయ్య మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. అక్కడ ఉన్న దుస్తులు, ఇతర ఆన వాళ్లను బట్టి అమృతదేహము శాంతయ్యదే అని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






