- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడకు ఇంటర్నెట్ కేబుల్ చుట్టుకుని స్కూటీదారుడికి తీవ్ర గాయాలు
రోడ్డుపై నిర్లక్ష్యంగా వేలాడదీసిన ఇంటర్నెట్ కేబుల్ ఓ వ్యక్తి మెడకు చుట్టుకుని ప్రమాదానికి గురై తీవ్రంగా గాయలైన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, మేడిపల్లి 11/03: రోడ్డుపై నిర్లక్ష్యంగా వేలాడదీసిన ఇంటర్నెట్ కేబుల్ ఓ వ్యక్తి మెడకు చుట్టుకుని ప్రమాదానికి గురై తీవ్రంగా గాయలైన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పీర్జాదిగూడకు చెందిన ఎండ్ల మనోహర్ (53) జూన్ 5న చెంగిచెర్ల ద్వారకానగర్ కాలనీ సమీపంలో స్కూటీపై వెళ్తుండగా, రోడ్డుపై వేలాడుతున్న ఇంటర్నెట్ కేబుల్ అకస్మాత్తుగా అతని మెడకు చుట్టుకోవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆయన వాహనాన్ని ఆపే ప్రయత్నంలో రోడ్డుపక్కన ఉన్న ఇటుకలపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఎడమకాలి మడమకు ఫ్రాక్చర్ అయింది. ప్రమాదం అనంతరం అక్కడికి వచ్చిన కేబుల్ ఏర్పాటు సిబ్బందిని బాధితుడు ప్రశ్నించగా, వారి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించాడు. రోడ్డుపై కేబుల్‌ను నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల తనతో పాటు ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






