ఈతకు వెళ్లి యువకుడు మృతి

by Taduka Kalyani |

ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన షాబాద్ మండల పరిధిలోని మన్మర్రి గ్రామంలో చోటు చేసుకుంది.

ఈతకు వెళ్లి యువకుడు మృతి
X

దిశ, షాబాద్: ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన షాబాద్ మండల పరిధిలోని మన్మర్రి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... షాద్ నగర్ లోని ఈశ్వర్ కాలనీకి చెందిన దకూరి భాస్కర్ కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మధు (19) ఈ నెల 10న షాబాద్ మండలం మన్మరి గ్రామానికి చెందిన తన స్నేహితుడు జష్వంత్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పి మన్మర్రి గ్రామానికి వెళ్ళాడు. గురువారం ఉదయం స్నేహితులతో కలిసి మన్మర్రి గ్రామంలో ఈతకు వెళ్ళాడు. ఈత కోసం బావిలోకి దూకిన మధు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు షాబాద్ పోలీసులు తెలిపారు.

Next Story