పశ్చిమ బెంగాల్‌లో సంచలనం.. కాలిబూడిదైన 4 వేల ఈవీఎం మిషిన్లు

by Kema Shiva Kumar |

పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం రాజకీయంగ తీవ్ర కలకలం రేపుతోంది.

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం.. కాలిబూడిదైన 4 వేల ఈవీఎం మిషిన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో రాజకీయ ఉద్రిక్తతల వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM Machines) భద్రపరిచే ఓ స్ట్రాంగ్ రూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద తీవ్రతకు ఏకంగా 4 వేల ఈవీఎం మిషిన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. తాజాగా ఈ ఘటనతో ఎన్నికల అధికారులు, స్థానిక యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే వేల సంఖ్యలో ఉన్న ఈవీఎంలు, వాటికి సంబంధించిన వీవీప్యాట్ (VVPAT), ఇతర పరికరాలు మంటల్లో కాలి బూడదయ్యాయి.

కుట్ర కోణంలో దర్యాప్తు.. FIR నమోదు

ఎన్నికల సామగ్రి భద్రపరిచే అత్యంత సురక్షితమైన ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిన షార్ట్ సర్క్యూటా.. లేర దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర దాగి ఉందా? అనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతునన్నారు. మరోవైపు భారీ సంఖ్యలో ఈవీఎంలు కాలిపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కూడా ఈ ఘటనపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం స్పా్ట్‌లో నమూనాలను సేకరించి పరిశీలిస్తున్నారు.

Next Story