- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామీణ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్..125 రోజులపాటు ఉపాధి
గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఉపాధి పనులు దొరకని సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు రాకుండా 125 రోజుల ఉపాధిని కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్సింగ్చౌహాన్వెల్లడించినట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు...

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఉపాధి పనులు దొరకని సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు రాకుండా 125 రోజుల ఉపాధిని కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్సింగ్చౌహాన్వెల్లడించినట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. గురువారం వీబీ జీ రామ్పథకం అమలు గురించి సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా ఆయన కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో నివసిస్తున్న పేద ప్రజలకు గత 12 ఏళ్లుగా 143.23 కోట్ల పని దినాలను కల్పించినట్లు, ఇందుకోసం మొత్తం రూ. 34,639.17 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు తెలియజేశారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.50 కోట్ల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఈనెల 09వ తేదీ నాటికి ఇందులో 4.38 కోట్ల పనిదినాలు పూర్తవగా, రూ. 1,163.64 కోట్ల నిధులను ఖర్చు చేసి 11,684 పనులను పూర్తి చేసినట్లు తెలియజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ పథకం కింద గతంలో అందిస్తున్న 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో అవసరమైన మార్పులు చేసి మోడీ ప్రభుత్వం వీబీ జీ రామ్పథకాన్ని తెచ్చిందన్నారు. 1 జూలై, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న ఈ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ. 3,825.31 కోట్ల నిధులను కేటాయించినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారన్నారు.
ఉపాధి పని చేసి వారికి 15 రోజుల్లో నగదు చెల్లింపు
పథకం కింద గ్రామీణ ప్రాంత ప్రజలకు 125 రోజుల గ్యారంటీ ఉపాధి లభించడంతో పాటు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కూలీల కుటుంబాలకు కొత్తగా గ్రామీణ రోజ్ గార్ గ్యారంటీ కార్డులు జారీ చేయడం. వారం రోజుల్లోనే ఉపాధికి సంబంధించిన నగదు పూర్తిగా కూలీలకు చెల్లించడం జరుగుతుంది. 15 రోజులకు మించి చెల్లింపు ఆలస్యమైతే ఆ మొత్తంపై 0.5శాతం వడ్డీని కూడా చెల్లించడం ఉంటుందన్నారు. నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించకపోతే 15 రోజుల్లో నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. పని ప్రదేశంలో కనీస మౌలిక వసతులు లేకుంటే 1800 123 2656 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేసే సదుపాయం. వ్యవసాయ పనుల సమయంలో వ్యవసాయ పనులకు, వ్యవసాయ కూలీల ఇబ్బంది లేకుండా 60 రోజులపాటు ఉపాధి స్కీమ్ పనులకు విరామం ఉంటుంది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, పని చేస్తున్నవారికి ముఖ ఆధారిత హాజరు, ఈ కేవైసీ తప్పనిసరి చేయడం వంటి ప్రయోజనాలు ఉపాధి హామీ పనుల లబ్ధిదారులకు ఖచ్చితంగా లభిస్తాయని చెప్పారు. 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు చేయనున్న ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సి ఉందని, ఈ పథకానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉందన్నారు. దీనితోపాటుగా వ్యవసాయ పనుల విరామానికి సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా వయవసాయదారులతో అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు.






