- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూవివాదంలో తమ్ముడు దాడి.. అన్నకు గాయాలు
కుటుంబ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం చేయిదాటింది. అన్నపై తమ్ముడు దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు.

దిశ, గీసుకొండ : కుటుంబ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం చేయిదాటింది. అన్నపై తమ్ముడు దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో తమ్ముడి పై కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. దస్రు తండాకు చెందిన కేలోత్ శంకర్‌కు సర్వే నెం. 549/A1 లో 2 ఎకరాల 35 గుంటల పట్టా భూమి ఉంది. ఈ భూమి విషయమై అతని తమ్ముడు కేలోత్ రవితో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో రవి తన స్నేహితుడితో కలిసి సదరు భూమిలోకి ట్రాక్టర్‌తో వెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన శంకర్‌కు, రవికి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో శంకర్ కిందపడటంతో తలకు గాయమైంది. అతని సెల్‌ఫోన్ కూడా ఈ ఘటనలో పాడైంది. గాయపడిన శంకర్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం బాధితుడు శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేలోత్ రవి, అతని స్నేహితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.






