ఆహార పదార్థాలను న్యూస్ పేపర్‌‌పై పెట్టుకొని తినడం.. ఎంత డేంజరో తెలుసా?

by Javid Pasha |   (  Updated:2026-06-11 14:59:10  IST  )

న్యూస్ పేపర్‌పై పెట్టుకొని తినే ఆహారాలు విషపూరితంగా మారవచ్చు. ఎందుకంటే అందులో లెడ్, కాడ్మియం వంటి హానికరమైన మెటల్స్ ఉంటాయి.

ఆహార పదార్థాలను న్యూస్ పేపర్‌‌పై పెట్టుకొని తినడం.. ఎంత డేంజరో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : సమోసాలో, బబ్జీలో, జిలేబీనో తిన్న తర్వాత వాంతింగ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయా? అయితే మీరు న్యూస్ పేపర్లో పెట్టి లేదా ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత తిన్నారేమో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి హానికరం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కూడా దీనిపై హెచ్చరికలు జారీచేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి విక్రేతలు, క్లౌడ్ కిచెన్ల నిర్వాహకులు న్యూస్ పేపర్లు లేదా రీసైకిల్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయడం, సర్వ్ చేయడం, స్టోర్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఇంతకీ ఇలా తినడం ఎందుకు ప్రమాదకరం, ఎలాంటి నష్టం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకు ప్రమాదం?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. న్యూస్ పేపర్‌లో చుట్టిన లేదా అందులో పెట్టుకొని తిన్న ఆహారాలు విషపూరితంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే.. వీటి ప్రింటింగ్ సిరా (Printing Ink)లో లెడ్ (Lead), కాడ్మియం (Cadmium) వంటి హానికరమైన హెవీ మెటల్స్, కెమికల్స్, పిగ్మెంట్స్& మినరల్ ఆయిల్స్ ఉంటాయి. కాబట్టి సమోసా, వడపావ్, జిలేబీ, చాట్ తదితర ఆహార పదార్థాలు వాటిపై పెట్టినప్పుడు ఇవి వాటిలో కలిసిపోయి విషతుల్యంగా మారుతాయి. దీంతో అనారోగ్యాలు సంభవిస్తాయి.

ఏం జరుగుతుంది?

న్యూస్ పేపర్‌లో ప్యాక్ చేసిన లేదా స్టోర్ చేసిన ఆహారాలు తింటే.. ఫుడ్ పాయిజనింగ్ అవ్వొచ్చు. దీంతో కడుపు నొప్పి, వాంతులు, డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక దీర్ఘకాలిక ప్రమాదాల విషయానికి వస్తే.. న్యూస్ పేపర్ ఇంక్‌లోని హెవీ మెటల్స్ శరీరంలో పేరుకుపోయి క్యాన్సర్, న్యూరోలాజికల్ సమస్యలు, కిడ్నీ/లివర్ దెబ్బ దెబ్బతినడం, రోగనిరోధక వ్యవస్థ బలహీన పడటం, పిల్లల్లో అయితే శారీరక ఎదుగుదల సమస్యలు వంటివి రావచ్చు. అందుకే న్యూస్ పేపర్‌లో ప్యాక్ చేసిన ఆహారాలు ఏవీ తినకపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Next Story