మధ్యలోనే ఆపేశారు... తిరిగి ఆప్షన్స్ ఇవ్వండి: TGO హెల్త్ ఫోరం విజ్ఞప్తి

by Vemula.Srinu Prasad |

వైద్య, ఆరోగ్య శాఖలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కూడా బదిలీలకు అవకాశం కల్పిస్తూ వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం ఇచ్చి మధ్యలోనే ఆపేశారని టీజీఓ అసోసియేషన్ డాక్టర్స్ ఫోరం అధ్యక్షులు డా. కత్తి జనార్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు..

మధ్యలోనే ఆపేశారు... తిరిగి ఆప్షన్స్ ఇవ్వండి: TGO హెల్త్ ఫోరం విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య, ఆరోగ్య శాఖలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కూడా బదిలీలకు అవకాశం కల్పిస్తూ వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం ఇచ్చి మధ్యలోనే ఆపేశారని... ఫలితంగా అనేక మంది వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బందితో పాటు డ్రగ్ ఇన్ స్పెక్టర్లు సహా అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని టీజీఓ అసోసియేషన్ డాక్టర్స్ ఫోరం అధ్యక్షులు డా. కత్తి జనార్ధన్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో వైద్యులు, డ్రగ్ ఇన్ స్పెక్టర్లు, పారామెడికల్, నర్సింగ్ తదితర వైద్యారోగ్య శాఖలోని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బృందం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీల కోసం వెంటనే వెబ్ ఆప్షన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్పౌజ్ కేసులు, అనారోగ్య కారణాలు, వితంతువుల అంశాలకు సంబంధించిన అసంపూర్తిగా ఉన్న బదిలీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. టీజీఓ ప్రతినిధుల వినతులను విన్న మంత్రి... అన్ని అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని... సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డాక్టర్స్ ఫోరం రాష్ట్ర నాయకులు డా.వంశీ, డా. వెంకట్ యాదవ్, డా.అభిరామ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆలె బాలకృష్ణ, అనిల్ రెడ్డి, ఆయుష్ ఫోరం అధ్యక్షులు డా.రవి కుమార్, నర్సింగ్ ఫోరమ్ అధ్యక్షులు సుజాత తదితరులు పాల్గొన్నారు.

Next Story