- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు శక్తి స్వరూపిణిలు మేయర్ మమత
నేటి మహిళలు వంటింటికే పరిమితం కాదని, వారు శక్తి స్వరూపిణిలు అని పాలమూరు నగర పాలక సంస్థ మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నేటి మహిళలు వంటింటికే పరిమితం కాదని, వారు శక్తి స్వరూపిణిలు అని పాలమూరు నగర పాలక సంస్థ మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ హైస్కూల్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీటీసీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ 42 రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో హైదరాబాద్ లో మాత్రమే నిర్వహించే టీటీసీ శిక్షణా కార్యక్రమాన్ని వికేంద్రీకరణ చేసి మహబూబ్ నగర్ తీసుకువచ్చామని, తద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు సౌకర్యవంతంగా అవకాశం కల్పించామని అన్నారు. త్వరలో మహిళలకు కుట్టు మిషన్లను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. జాతీయ బీసీ మహసభ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, జనాభాలో సగభాగమైన మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లు వెంకట్రాములు, బషీర్, కోఆర్డినేటర్, ఆర్ట్స్ టీచర్ చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, సినినటుడు రాంబాబు, తదితర శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.






