లక్కీచాన్స్ కొట్టేసిన గుంటూరు యువకుడు.. భారత్‌-Aకు షేక్ రషీద్ ఎంపిక

by Kema Shiva Kumar |

భారత్‌-ఎ (India-A) క్రికెట్‌ జట్టుకు గుంటూరు యువ సంచలనం షేక్‌ రషీద్‌ ఎంపికయ్యాడు.

లక్కీచాన్స్ కొట్టేసిన గుంటూరు యువకుడు.. భారత్‌-Aకు షేక్ రషీద్ ఎంపిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన యువ క్రికెట్ సంచలనం షేక్‌ రషీద్‌ (Sheikh Rashid) జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటాడు. ప్రతిష్టాత్మక భారత్‌-ఎ (India-A) క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్‌లో రషీద్ భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విడుదల చేసిన అధికారిక భారత్-ఎ జట్టులో షేక్ రషీద్‌కు చోటు దక్కింది. రంజీలో అతడు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన, స్థిరమైన బ్యాటింగ్‌ను రషీద్‌ను జట్టుకు ఎంపికయ్యేలా చేశాయి.

అండర్-19 నుంచి ఇండియా-A వరకు..

షేక్ రషీద్ గతంలో భారత అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో వైస్ కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో ఒత్తిడిలోనూ నిలకడగా ఆడి భారత జట్టును విజేతగా నిలపడంలో ఆయన అందించిన భాగస్వామ్యాలు మరువలేనివి. అనంతర అతడు ఐపీఎల్ (IPL)లోనూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వంటి స్టార్ ఫ్రాంచైజీకి ఎంపికై మహేంద్ర సింగ్ ధోనీ పర్యవేక్షణలో రాటుదేలాడు. అయితే, షేక్ రషీద్ భారత్-ఎ జట్టుకు ఎంపికైనట్లు వార్త తెలియగానే గుంటూరులోని ఆయన నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతినిధులు కూడా రషీద్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు.

Next Story