రీ వాల్యుయేషన్‌పై ఓయూ స్పష్టత

by Jakkula.Mamatha |

లా పరీక్షల రీ వాల్యుయేషన్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్న వార్తలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం స్పందించింది.

రీ వాల్యుయేషన్‌పై ఓయూ స్పష్టత
X

దిశ, సికింద్రాబాద్: లా పరీక్షల రీ వాల్యుయేషన్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్న వార్తలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం స్పందించింది. పరీక్షల మూల్యాంకనం, పునర్మూల్యాంకనం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, డిజిటల్ భద్రతతో నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. ఇటీవల విడుదలైన లా పరీక్షల ఫలితాల్లో 5,831 మంది విద్యార్థుల్లో 86 శాతం మంది తమ మార్కులపై సంతృప్తి వ్యక్తం చేయగా, 14 శాతం మంది మాత్రమే రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసినట్లు తెలిపింది.

పునర్మూల్యాంకనం అనంతరం మొత్తం 300 మంది విద్యార్థుల మార్కులు లేదా గ్రేడ్‌లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని, ఇది మొత్తం విద్యార్థుల్లో 5.14 శాతం మాత్రమేనని పేర్కొంది. సబ్జెక్టివ్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో స్వల్ప మార్కుల వ్యత్యాసాలు సహజమని, దీనిని వ్యవస్థాగత లోపంగా పరిగణించలేమని అధికారులు వివరించారు. మూల్యాంకనం, రీ వాల్యుయేషన్‌లో తప్పులకు ఆస్కారం లేదని, అయినప్పటికీ నిర్లక్ష్యం తేలితే మూల్యాంకన దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ ఆచార్య జి.నరేష్ రెడ్డి తెలిపారు.

Next Story