వీళ్లా మాట్లాడేది.. అసలు ఆ హక్కు ఉందా: మంత్రి అచ్చెన్నాయుడు

by Vemula.Srinu Prasad |

స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై జగన్ , వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

వీళ్లా మాట్లాడేది.. అసలు ఆ హక్కు ఉందా: మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం(Visakha Steel Plant Accident)పై జగన్ (Jagan), వైసీపీ నేతలు(Ycp leaders) చేస్తున్న విమర్శలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు సర్వనాశనం చేసిందని విమర్శించారు. ఈరోజు మళ్లీ నీతులు చెబుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. దుష్ప్రచారం చేయడం, ఫేక్ రాజకీయాలు చేయడం మాత్రమే గొడ్డలి పార్టీ విధానమని, సిద్ధాంతమని విమర్శించారు. రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హతే వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని దౌర్భాగ్యులు వైసీపీ నేతలని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం నిర్వహించిన 'మెగా డీఎస్సీ'ని అడ్డుకోవడానికి ఏకంగా 86 కేసులు వేసి విఫలమయ్యారన్నారు. నిరుద్యోగ యువతపై జగన్ చేసిన కుట్రలు ఇక సాగవని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసి, వ్యవస్థలను విధ్వంసం చేసిన వీళ్లా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story