- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాలీల అరెస్ట్!
గచ్చిబౌలిలో హిల్ రిడ్జ్ విల్లాలో నేపాలి గేమ్‌కు భారీ దోపిడీని సైబరాబాద్ పోలీసులు ఛేదించారు.

దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలిలో హిల్ రిడ్జ్ విల్లాలో నేపాలి గేమ్‌కు భారీ దోపిడీని సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ రమేష్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇంటి యజమానులు లేని సమయంలో విల్లాలో దోపిడీ చేసి పారిపోయిన నేపాలి గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. విల్లాలో వృద్ధ దంపతులు వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆభరణాలు అదృశ్యమయ్యాయి. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన విషయాన్ని కుమారుడకి చెప్పగా ఇంటికి వచ్చి, తన వద్ద ఉన్న తాళం చెవితో లాకర్‌ను తెరిచారు. ఆ లాకర్ నుండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు.
ఈ సమాచారం అందిన వెంటనే, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఆపరేషన్స్, టీమ్ క్రైమ్ బృందాలు, స్థానిక పోలీసులను రంగంలోకి దించారు.నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఆరు పోలీస్ బృందాలను పంపారు. అనుమానితుల వివరాలు వారి ఛాయా చిత్రాలను ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులకు అందజేశారు.వారి సహాయంతో నేపాలీ నేరస్తుల ముఠాలను పట్టుకోవడం కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం కూడా ఈ దర్యాప్తులో పూర్తి సహకారాన్ని అందించింది. గచ్చిబౌలి పోలీస్ ఇన్‌స్పెక్టర్ పి. నరేష్ బృందం రాంపూర్ జిల్లా ఎస్పీ సహకారంతో, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా, బిలాస్‌పూర్ రోడ్డు వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన ఆస్తి అంతా యథాతథంగా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కమల్ షాహి(32), విమల షాహి ,కల్పన షాహిలు ఉన్నారు.
దోపిడీలకు పాల్పడేందుకు పని మనుషులుగా చేరి..
నగరంలో దోపిడీలకు పాల్పడేందుకు ప్రత్యేక ముఠా ఉంది. ఈ ముఠా ధనికులు నివాసం ఉండే విలాసవంతమైన విల్లాలు గుర్తించి పని మనుషులుగా చేరుతారు. ఇంటి యజమానులు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని, తలుపులు , లాకర్లను పగలగొట్టి బంగారం, నగదు ఇతర విలువైన వస్తువులు దొంగిలిస్తారు. పరారీలో ఉన్న నిందితుడు నేపాలీ వాసి సురేష్ నేపాల్ నుండి వ్యక్తులను హైదరాబాద్‌కు రప్పించి, ఖరీదైన విల్లాలలో ఇళ్లలో పనిమనుషులుగా నియమిస్తుంటాడు. తాను నియమించిన పని మనుషుల ద్వారా కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాల గురించి సమాచారం సేకరించి, ఆ సమాచారం ఆధారంగా దొంగతనాలకు పాల్పడతాడు. కరణ్ బిశ్వ కర్మ సహాయంతో సురేష్ హిల్ రిడ్జ్ విల్లాస్'లోని విల్లా నంబర్ 73లో పని మనుషులను నియమించి, ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు.
నిందితుల నుంచి 7.837 గ్రాముల బంగారం, 1361 గ్రాముల వెండి వస్తువులు రూ. 33 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. లాకర్ పక్కనే ఉన్న తాళం చెవిని గుర్తించి, దానితో లాకర్ తెరిచి, ఆభరణాల అన్నింటినీ తీసుకుని పారిపోయినట్లు నిందితులు అంగీకరించారు. హిల్ రిడ్జ్ విల్లాస్‌లో జరిగిన భారీ దొంగతనం కేసును వేగంగా ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులు అధికారులకు సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి అభినందించారు.






