Health : ఒత్తిడి మాత్రమే కాదు.. డైట్ వల్ల కూడా ఆ సమస్యలు!

by Javid Pasha |

ఫైబర్ లేని ఆహారాలు ఎక్కువగా తినడంవల్ల తినడంవల్ల కూడా మెదడువాపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు రావచ్చు!

Health : ఒత్తిడి మాత్రమే కాదు.. డైట్ వల్ల కూడా ఆ సమస్యలు!
X

దిశ, ఫీచర్స్ : అధిక అలసట, మరచిపోవడం, ఏకాగ్రత్త తగ్గడం వంటివి ఆఫీసు ట్రెస్ వల్ల వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది మాత్రమే ప్రధాన కారణం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి చాలా సార్లు డైట్ వల్ల వచ్చే న్యూరో ఇన్‌ఫ్లమేషన్(మెదడులోవాపు) వల్ల కూడా ఏర్పడవచ్చుని చెబుతున్నారు. ముఖ్యంగా అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్, ఫైబర్ ఆహారాలు చాలా తక్కువగా తీసుకోవడం వల్ల గట్(ప్రేగులు)లో అసమతుల్యత ఏర్పడి, గట్-బ్రెయిన్ యాక్సిస్ ద్వారా మెదడులో వాపు వస్తుంది. దీని వల్ల బ్రెయిన్ ఫాగ్, అలసట, మరపును ప్రభావితం చేస్తుంది.

లక్షణాలు

నిరంతర అలసట, మరచిపోవడం, చిరాకు, ఏకాగ్రత లోపించడం, మోటివేషన్ తగ్గడం వంటివి రావడానికి కేవలం పని ఒత్తిడి, మానసిక ఒత్తి మాత్రమే కాదు, ఫైబర్ లేని ఆహారాలు (జంక్ ఫుడ్స్) ఎక్కువగా తినడంవల్ల తినడంవల్ల కూడా వస్తుంటాయి. ఇక నిద్రలేమి, నిశ్చల జీవనశైలి, అధిక కెఫీన్, భోజనాలు స్కిప్ చేయడం వంటివి దీన్ని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక స్ట్రెస్‌తోపాటు పేలవమైన డైట్ ఉంటే మెదడు పనితీరు బాగా దెబ్బతింటుంది.

పరిష్కారం ఏమిటి?

పండ్లు, కూరగాయలు, నట్స్, ఒమేగా-3 రిచ్ ఫుడ్స్ (చేపలు, వాల్‌నట్స్) వంటి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు తినడంవల్ల నిరంతర అలసట, మతిమరుపు, చిరాకు, ఏకాగ్రతలోపం సమస్యల నుంచి బయటపడేందుకు సహాయపడతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి అంటున్నారు నిపుణులు. బదులుగా పెరుగు, మజ్జిగ, గజ్జి, ఊరగాయలు వంటి ప్రోబయోటిక్స్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా గట్ హెల్త్ మెరుగుపడుతుంది. దీంతోపాటు తగినంత నీళ్లు తాగడం, సరైన నిద్ర, శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం. ఈ విధమైన ఆహార నియమాలతో సమస్య పరిష్కారం కాకపోయినా.. లక్షణాలు 2-3 వారాలకంటే ఎక్కువ కొనసాగినా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం.అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story