ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత: అటవీ రేంజ్ అధికారి

by Kodari Anjali |

శివరాం మొసళ్ల అభయారణ్యాన్ని మంథని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల విద్యార్థినులు సందర్శించారు.

ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత: అటవీ రేంజ్ అధికారి
X

​దిశ, మంథని: పెద్దపల్లి జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే క్రమంలో భాగంగా, ‘ఎన్విరాన్‌మెంట్ థీమ్ ప్రోగ్రామ్స్’లో భాగంగా గురువారం శివరాం మొసళ్ల అభయారణ్యం వేదికగా ‘వనదర్శిని’ కార్యక్రమాన్ని నిర్వహించామని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం. వినయ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంథని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 42 విద్యార్థినులకు, పి.ఇ.టి శ్రీనివాస్, ఇద్దరు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఖానాపూర్ బ్లాక్ 268 శివరాం మొసళ్ల అభయారణ్యాన్ని విద్యార్థులకు సందర్శింపజేశారు. విద్యార్థులకు అడవుల ప్రాముఖ్యత, వన్యప్రాణుల సంరక్షణ,పర్యావరణ సమతుల్యతలో అడవులు పోషిస్తున్న కీలక పాత్రపై అటవీ శాఖ సిబ్బంది వివరించారు. ప్రకృతిని చిన్నతనం నుంచే ప్రేమించాలని, అడవులను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.​ ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎఫ్ఆర్ఓ టి. సతీష్ కుమార్, ఖానాపూర్ సర్పంచ్ ఎస్. అరుణ, వార్డు సభ్యులు, జె. తిరుపతి, జి. కొమురయ్య, పి. దేవదాస్, ఎఫ్ఎస్ఓలు ఎం. నర్సయ్య, హెచ్. మంగిలాల్, రహమతుల్లా, ఎండీ. అమీరుద్దీన్, ఎస్.కె. నహీదా పర్వీన్, ఎం. శ్రీకాంత్, ఏ. మాధురి, పి. రజిత, మేహరాజ్, ఎస్. ప్రదీప్, అక్తర్ పాషా, టి. రామ్ సింగ్ అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.​

Next Story