ఏపీలో కాక్రోచ్ రాజకీయం.. మేము కూడా అంటూ జగన్ ప్రకటన

by Vemula.Srinu Prasad |

దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ పార్టీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఆఖరికి కాక్రోచ్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ సైతం బ్యాన్ వరకూ వెళ్లింది..

ఏపీలో కాక్రోచ్ రాజకీయం.. మేము కూడా అంటూ జగన్ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ పార్టీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఆఖరికి కాక్రోచ్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ సైతం బ్యాన్ వరకూ వెళ్లింది. అయినా సరే వేరే నేమ్‌తో మళ్లీ తన పోస్టులను కాక్రోచ్ పార్టీ కొనసాగించింది. ఇదిలా ఉంటే కాక్రోచ్ రాజకీయం ఏపీని కూడా తాకింది. కాక్రోచ్ పార్టీపై స్పందించాలంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్రంలో తామే కాక్రోచ్ అని అన్నారు. తప్పు ఒప్పుకోకుండా ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెడితే కాక్రోచ్‌లు లేస్తాయని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు.

Next Story