- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MakeMyTrip: హోటల్ బుకింగ్‌లలో మేక్‌మైట్రిప్ కొత్త ఫీచర్
బుకింగ్ సమయంలోనే 'ఎర్లీ చెక్-ఇన్' లేదా 'లేట్ చెక్-అవుట్' సదుపాయాన్ని కన్ఫర్మ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ట్రావెల్ టెక్నాలజీ దిగ్గజం మేక్‌మైట్రిప్ పర్యాటక రంగంలో కస్టమర్ల ప్రధాన సమస్యకు చెక్ పెడుతూ సరికొత్త ఫీచర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. హోటళ్లకు ఉదయాన్నే చేరుకున్నా, లేదా సాయంత్రం ఆలస్యంగా రూమ్ ఖాళీ చేయాలన్నా ప్రయాణికులు పడే ఇబ్బందులను దూరం చేస్తూ.. బుకింగ్ సమయంలోనే 'ఎర్లీ చెక్-ఇన్' లేదా 'లేట్ చెక్-అవుట్' సదుపాయాన్ని కన్ఫర్మ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. నిర్ణీత అదనపు రుసుము చెల్లించడం ద్వారా కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి 3, 6 లేదా 9 గంటల ముందస్తు లేదా అదనపు సమయాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు దేశంలోని 10,000కు పైగా హోటళ్లు, విల్లాలు, హోమ్‌స్టేలలో అందుబాటులోకి రాగా, అంతర్జాతీయంగా 20 ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్లలో 1,000కి పైగా ప్రాపర్టీలకు విస్తరించాయి. కంపెనీ వర్గాల ప్రకారం.. దేశీయ పర్యాటకుల్లో 53 శాతం మంది ఉదయం 9 గంటల కంటే ముందే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అలాగే 54 శాతం మంది మధ్యాహ్నం 3 గంటల తర్వాతే తిరుగు ప్రయాణం అవుతున్నారు. సాధారణ హోటల్ రూల్స్ (మధ్యాహ్నం 12 గంటల చెక్-ఇన్, చెక్-అవుట్) కారణంగా మెజారిటీ కస్టమర్లు ఇబ్బంది పడుతున్నట్లు కంపెనీ గుర్తించింది.






