జిన్నారం లో పేరుకుపోయిన చెత్త.. కంపు కొడుతున్న వీధులు

by Taduka Kalyani |

మున్సిపల్ కేంద్రమైన జిన్నారం లో వీధులన్నీ కంపు కొడుతున్నాయి.

జిన్నారం లో పేరుకుపోయిన చెత్త.. కంపు కొడుతున్న వీధులు
X

దిశ, జిన్నారం: మున్సిపల్ కేంద్రమైన జిన్నారం లో వీధులన్నీ కంపు కొడుతున్నాయి. బుధవారం జిన్నారం లో అంగడి జరగగా గురువారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు విధులను ఊడుస్తారు. కానీ గురువారం కార్మికులు విధులను శుభ్రం చేయకపోవడం తో వీధులన్నీ కంపు కొడుతున్నాయి. ఎక్కడి చెత్త అక్కడ వీధులపై ప్రత్యక్షమైంది. దీనికి తోడు కోతులు స్వైర విహారం చేసి అంగట్లో వదిలిన కూరగాయలను రోడ్డుపై పడేస్తున్నాయి. గ్రామంలోని విధుల్లో భారీగా చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో శుభ్రం చేయలేదని తెలుస్తోంది. విషయం మున్సిపల్ కమిషనర్ కు తెలిపినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం సీజన్ లో గాలి దుమారం ఒక్కసారిగా రావడంతో విధుల్లో ఉన్న చెత్త ఇండ్లలోకి వస్తుంది. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story