- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజరాంపల్లిలో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో విసృతంగా తనిఖీలు
రాజారాంపల్లిలోని దుకాణంలోడాగ్ స్క్వాడ్ తో సీఐ తనిఖీలు నిర్వహించారు.

దిశ, వెల్గటూర్: గంజాయి ఇతరత్రా మత్తు పదార్థాల నివారణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంటీ డ్రగ్స్ నార్కో టీమ్, డాగ్ స్క్వాడ్ సహకారంతో ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో పోలీసులు గురువారం విస్తృతంగా తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్లు ధర్మపురి సీఐ రామ్ నర్సింహారెడ్డి తెలిపారు. రాజారాంపల్లి వివేకానంద కూడలిలో వ్యాపార వాణిజ్య సముదయాలు హోటల్స్ పాన్ షాపుల్లో సీఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందంతో విసృతంగా తనిఖీలు చేపట్టారు.
శాంతి భద్రతలను మరింత బలోపేతం..
ప్రతి దుకాణంలో పోలీసులు గంజాయి మత్తు పదార్తాల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల నివారణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నామని సీఐ తెలిపారు.. ప్రజల భద్రత దృష్ట్యా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు లేదా సంచులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయికి అలవాటు పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు . గ్రామాల్లో ఎవరైనా గంజాయి తాగిన విక్రయించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో పాల్గొన్న వెల్గటూర్ ఎస్సై పి. ఉదయ్ కుమార్, మాట్లాడుతూ.. ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయగలమని తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగు తాయని ఎస్సై ఉదయ్ తెలిపారు.






