పోలీస్ అకాడమీలో ఆధునిక సదుపాయాల విస్తరణ

by Taduka Kalyani |

తెలంగాణ పోలీస్ అకాడమీలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను డైరెక్టర్ అభిలాష్ బిస్త్ , ఐపీఎస్ ప్రారంభించారు.

పోలీస్ అకాడమీలో ఆధునిక సదుపాయాల విస్తరణ
X

దిశ, గండిపేట: తెలంగాణ పోలీస్ అకాడమీలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను డైరెక్టర్ అభిలాష్ బిస్త్ , ఐపీఎస్ ప్రారంభించారు. ఉద్యోగులు, శిక్షణార్థులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అకాడమీ ప్రధాన ద్వారం వద్ద నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాప్‌ను అభిలాష్ బిష్ట్ ప్రారంభించారు. ఆమె చొరవతో ముషీరాబాద్ డిపో మేనేజర్ రఘు సహకారంతో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు నడిచేలా చర్యలు తీసుకున్నారు. అకాడమీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో నూతనంగా నిర్మించిన స్టేజ్‌ను కూడా ప్రారంభించారు. పరేడ్లు, క్రీడా పోటీలు, సాంస్కృతిక, శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌లో 142 మంది పిల్లలు పాల్గొన్నారు. యోగా, చెస్, కంప్యూటర్, ఆర్ట్స్, డాన్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, డ్రాయింగ్ తదితర అంశాల్లో శిక్షణ పొందారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఆర్‌ఐ కృష్ణ క్యాంప్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన “చిన్నారి” క్రెచ్ ప్రస్తుతం 15 మంది చిన్నారులకు సేవలందిస్తోంది. అక్షరాలు, సంఖ్యలు, రైమ్స్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆటల ద్వారా చిన్నారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కేంద్రం అడ్మిన్ ఆర్‌ఐ మహేష్ ఆధ్వర్యంలో నడుస్తోంది. అలాగే “తరంగజ్యోతి” కార్యక్రమం ద్వారా ఉద్యోగులు, శిక్షణార్థులు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంగ్లీష్, మ్యాథ్స్, చెస్, కంప్యూటర్, సైన్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ఆర్‌ఐ కృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఉద్యోగుల సౌకర్యార్థం అకాడమీలో ఆధునిక క్యాంటీన్, స్టోర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు డి. మురళీధర్, వెంకటేశ్వర్లు, శ్రీరామమూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్లు నాగేశ్వరరావు, వేముల శ్రీనివాసరావు, రాంబాబు, డీఎస్పీలు సతీష్, ఆడూరి శ్రీనివాసరావు, తిరుపతి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story