- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలోనే ఆదర్శ మార్కెట్‌గా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్..
తెలంగాణలోనే ఆదర్శ మార్కెట్ పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

దిశ, పటాన్ చెరు టౌన్ : తెలంగాణలోనే ఆదర్శ మార్కెట్ పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించారు. యార్డు పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్ చెరు ప్రాంత అభివృద్ధి, వ్యాపార విస్తరణ, మరియు ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. 20 కోట్ల 46 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్దేశించిన గడువుల్లోగా వీటిని పూర్తి చేసి లైసెన్స్ వ్యాపారస్తులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేకల మండి, చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మేకల మండితో పాటు ఆధునిక స్లాటర్ హౌస్‌తో పాటు ఎస్‌టీపీ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మార్కెట్‌లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు మార్కెట్ ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వ్యాపారులు, స్థానిక ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సహకారంతో మార్కెట్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన, నంబర్ వన్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మార్కెట్ ఆదాయం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెటింగ్ విభాగం డిఈ రవీందర్, మార్కెట్ కార్యదర్శి సునీల్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.






