మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఏడాది జైలు శిక్ష

by Kodari Anjali |

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి జగిత్యాల న్యాయస్థానం ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఏడాది జైలు శిక్ష
X

దిశ, జగిత్యాల టౌన్: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి జగిత్యాల న్యాయస్థానం ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 సంవత్సరంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక మహిళ పట్ల కల్లేపల్లి రాజేష్ (28) అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ లావణ్య సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Next Story