- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు సమర్థవంతమైన సేవలందించాలి : ఎస్పీ జానకి
మండల పరిధిలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలను అందించాలని ఎస్పీ జానకి సూచించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మండల పరిధిలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలను అందించాలని ఎస్పీ జానకి సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ పోలీస్ స్టేషన్ ప్రస్తుత ఎస్ఐ శ్రీనివాస్ నుంచి గురువారం నూతన ఎస్ఐ గా కె.మురళి భాద్యతలు స్వీకరించి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భారత సైన్యంలో 18 సంవత్సరాలు దేశ సేవలో విధులు నిర్వహించి, 2020 లో ఎస్ఐ గా పోలీస్ శాఖలో చేరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ.. ఇటీవలే అడ్డాకల్ పోలీస్ స్టేషన్ కు ఆయన బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మురళికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాను మండల ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించి, వారి విశ్వాసాన్ని చూరగొని పోలీస్ శాఖ కు మంచిపేరు తెస్తానని ఎస్ఐ మురళి తెలిపారు.






