- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశుద్ధ్య వాహనాలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే
by Kodari Anjali |
చెత్త చెదారం రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య వాహనలను ఉపయోగించుకోవాలని నేనావత్ బాలునాయక్ అన్నారు.

X
దిశ, కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతన పారిశుద్ధ్య వాహనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌కి కొండమల్లేపల్లి సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి శాలువాతో సన్మానం చేసి స్వాగతం పలికారు. తదనంతరం పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పారిశుద్ధ్య వాహనాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెత్త చెదారం రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య వాహనలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉట్కూరి వేమన్ రెడ్డి, ఉపసర్పంచ్ కోడిదాల పద్మ వెంకటయ్య, అధికారులు ఎంపీడీవో స్వర్ణలత, గ్రామపంచాయతీ సెక్రటరీ డాకు నాయక్ నాయకులు, వార్డ్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.
Next Story






