- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుద్రారంలో ప్లాట్ యజమానుల ఆందోళన
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని సాయినాథ్ గార్డెన్స్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు గురువారం ఆందోళనకు దిగారు

దిశ, పఠాన్‌చెరు టౌన్ : సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని సాయినాథ్ గార్డెన్స్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. 2004లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన తమ ప్లాట్లను అక్రమంగా ఇతరుల పేర్లకు మార్చి, ఎల్‌ఎస్‌ఎంఎల్ కంపెనీకి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారని ఆరోపిస్తూ జీపీఆర్ లే అవుట్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, రెవెన్యూ అధికారుల సహకారంతో తమ ఆస్తులను దారి మళ్లించి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. దశాబ్దాలుగా తమ హక్కుల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్లాట్లను వెంటనే స్వాధీనం చేసి అసలు యజమానులకు అప్పగించాలని, ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీపీఆర్ రియల్ మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన బాధితులు, అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే బాధ్యులపై 4 ఎఫ్ఐఆర్ నమోదయాయని, కేవలం జెపిఆర్ కళ్యాణ బాబును మాత్రమే అరెస్టు చేసి మిగతా వాళ్లను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పది రోజుల క్రితం మిగతా వారిని అరెస్ట్ చేయాలని కమిషనర్ ని కలిసిన ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. బాధ్యులైన ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ డైరెక్టర్ జైన్, సురేందర్ రెడ్డి, చంద్ర ప్రసాద్ లు దొంగతనంగా ఇంజక్షన్ ఆర్డర్లు తెప్పించుకొని, ఎస్ఐఆర్ లు నమోదైన బయట దర్జాగా తిరుగుతూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిశీలిస్తామని హామీ ఇవ్వాలని బాధితులు కోరారు.ఆందోళన కారణంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.






