- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > లింగ నిర్ధారణ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ రాహుల్ శర్మ
లింగ నిర్ధారణ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ రాహుల్ శర్మ
గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

X
దిశ, భూపాలపల్లి ప్రతినిధి : గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో పీసీ పీఎన్‌డీటీ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టు అమలుపై వైద్య, పోలీస్, ఐఎంఏ, మాలి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీసీ పీఎన్‌డీటీ చట్టం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రైవేట్ ,ప్రభుత్వ వైద్య సంస్థలు నమోదు ప్రక్రియను పూర్తి చేసి, చట్టపరమైన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. వైద్య సేవలు ప్రజలకు నాణ్యంగా, పారదర్శకంగా అందించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. మధుసూదన్, ఐఎంఏ అధ్యక్షులు డా. కె.ఎస్. కిరణ్, మాలి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సదానందం, డిప్యూటీ వైద్యాధికారి డా. శ్రీదేవి, డెమో శ్రీదేవి పాల్గొన్నారు.
Next Story






