- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబాయ్‌లో వడియారం వాసి గుండెపోటుతో మృతి
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది సాయి కిరణ్ (35) దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

దిశ, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది సాయి కిరణ్ (35) దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం గత ఏడాది మే నెలలో సాయి కిరణ్ దుబాయ్‌కు వెళ్లాడు. ఈ నెల 2వ తేదీన ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం ప్రవాసీ ప్రజావాణి సహాయాన్ని ఆశ్రయించారు. దీంతో అధికారులు స్పందించి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ సాయి కిరణ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. సాయి కిరణ్‌కు భార్య నాగలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న సాయి కిరణ్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






